

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఏకంగా 36 రోజుల వ్యవధిలో మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘కల్ట్’ అక్టోబర్ 30న, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ నవంబర్ 19న విడుదల కానున్నాయి. సాయికిరణ్ రెడ్డి తెరకెక్కిస్తున్న పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ ‘లెగసీ’ డిసెంబర్ 4న థియేటర్లలోకి రానుంది.
ఇటీవల విడుదలైన ‘లైలా’, ‘ఫంకీ’ చిత్రాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించకపోవడంతో విశ్వక్ సేన్ ఈ విభిన్నమైన కథాంశాలపై దృష్టి పెట్టాడు. బయట ఈవెంట్లకు దూరంగా ఉంటూ పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు వేర్వేరు జానర్లలో వస్తున్న ఈ చిత్రాల్లో ఏది విశ్వక్ సేన్‌కు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కంబ్యాక్‌ను అందిస్తుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!