
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న జరగనున్న నేపథ్యంలో అభిమానులు విశ్వంభర సినిమా నుంచి భారీ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సోషియో ఫాంటసీ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఈ సినిమాను అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విడుదల తేదీ ఖరారైతే విశ్వంభర, రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2తో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీకి దిగనుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!