

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రేపు గ్రాండ్‌గా విడుదల కానుంది. సూర్య కెరీర్‌లో మరో హిట్‌గా ఈ సినిమా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రపంచవ్యాప్తంగా భారీ థియేట్రికల్ టార్గెట్‌తో బరిలోకి దిగుతోంది. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు కలిపి ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మిగతా మార్కెట్ల నుంచి మరో రూ.30 కోట్ల వరకు టార్గెట్ ఉన్నట్లు సమాచారం. దీంతో వరల్డ్ వైడ్‌గా మొత్తం రూ.90 కోట్ల టార్గెట్‌తో సినిమా విడుదలవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘కరుప్పు’తో పోలిస్తే ఈ సినిమాకు దాదాపు రూ.200 కోట్ల గ్రాస్ వస్తేనే సేఫ్ జోన్‌లోకి వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఈ భారీ టార్గెట్‌ను ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అందుకుంటుందో లేదో చూడాలి. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!