

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ ఎన్నో సంవత్సరాలు హీరోగా విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగించి, ప్రస్తుతం విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టిన ఆయన, ప్రస్తుతం ‘డ్రామా జూనియర్స్ సీజన్ 9’లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. టెలివిజన్ షోలకు గతంలో వచ్చిన ఆఫర్లను తిరస్కరించినట్లు శ్రీకాంత్ తెలిపారు.
నాగార్జున టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించడం, అనిల్ రావిపూడి వంటి దర్శకులు కూడా టెలివిజన్ కార్యక్రమాల్లో భాగం కావడం చూసి తాను కూడా ప్రయత్నించాలని భావించినట్లు చెప్పారు. అదే సమయంలో ‘డ్రామా జూనియర్స్’ నుంచి వచ్చిన ఆఫర్‌ను అంగీకరించానని, అనిల్ రావిపూడి ప్రోత్సాహంతో జడ్జిగా బాధ్యతలు తీసుకున్నానని వెల్లడించారు. ప్రస్తుతం ఈ షోలో శ్రీకాంత్, అనిల్ రావిపూడి, రోజా జడ్జిలుగా ఉండగా, సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా కొనసాగుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!