

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ మైథలాజికల్ చిత్రంపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి చివరి నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. అప్పటివరకు త్రివిక్రమ్ ప్రీ ప్రొడక్షన్ పనులు, కథా రచన, విజువల్ డిజైన్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న డ్రాగన్ చిత్రీకరణను పూర్తిచేసిన తర్వాత ఈ కొత్త ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం. పౌరాణిక నేపథ్యంతో పాటు భారీ యాక్షన్, అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా ఉండనున్నాయని తెలుస్తోంది. కథకు అనుగుణంగా ఎన్టీఆర్ పాత్రను కూడా ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ దేవుడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ముఖ్యంగా శివుడి కుమారుడు, పార్వతి గర్వకారకుడు సుబ్రహ్మణ్య స్వామి పాత్రలో తారక్ నటించనున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన లుక్‌ను ప్రత్యేకంగా రూపొందించేందుకు త్రివిక్రమ్ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పబడుతున్న ఈ చిత్రంపై ప్రతి అంశాన్ని జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!