

తెలుగు సినీ పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు స్టార్‌డమ్ తీసుకొచ్చిన కథానాయికల్లో అనుష్క శెట్టి ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. బలమైన పాత్రలు, కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ హీరోయిన్ ప్రధానంగా సాగే చిత్రాలకు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆదరణ తీసుకొచ్చారు. ప్రస్తుతం అనుష్క సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడంతో.. ఆమె తరహాలో కథను తన భుజాలపై మోసే హీరోయిన్ ఎవరనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సమంత, రష్మిక మందన్న పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సమంత ఇప్పటికే కథానాయిక ప్రాధాన్యమున్న, నటనకు ఆస్కారమున్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
మరోవైపు రష్మిక మందన్న కూడా రెగ్యులర్ కమర్షియల్ పాత్రలకు భిన్నంగా హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ తన ఇమేజ్‌ను విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మైసా’పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా రష్మిక కెరీర్‌లో మరో కీలకమైన అడుగుగా నిలుస్తుందా అన్నది చూడాలి. అయితే అనుష్క తన సినిమాలతో సృష్టించుకున్న ప్రత్యేకమైన స్థానాన్ని మరొకరితో నేరుగా భర్తీ చేయడం అంత సులభం కాదు. భవిష్యత్తులో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోయిన్లు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!