
జనరల్

నాగచైతన్య ఓటీటీ రంగప్రవేశం చేసిన ‘దూత’ వెబ్‌సిరీస్ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు దాదాపు మూడేళ్ల తర్వాత ‘దూత 2’ పేరుతో సీక్వెల్ ప్రారంభమైంది. ఈసారి నాగచైతన్య నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం.
ఈ ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమని నాగచైతన్య తెలిపారు. నటనకు మించి కూడా ఈ సిరీస్‌కు తన వంతు సహకారం అందించాలని భావించి నిర్మాత బాధ్యతలు చేపట్టినట్లు వెల్లడించారు. దర్శకుడు విక్రమ్ కుమార్, నిర్మాత శరత్ మారర్‌లతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేశారు. మరోవైపు ఈ సిరీస్‌లో నటి భూమిక కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!