
జనరల్

తెలంగాణలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా దాదాపు 24 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో నమోదైన 3.38 కోట్ల ఓటర్లలో ఇప్పటికే 71.34 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయ్యిందని తెలిపారు.
బీఎల్ఓల పరిశీలనలో సుమారు 6.50 లక్షల మంది మరణించిన ఓటర్లు, 12 లక్షలకు పైగా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, 2.60 లక్షల డూప్లికేట్ ఓటర్లు, 78 వేల మంది ఆచూకీ లేని ఓటర్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వచ్చే నెల 3న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితా నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!