
గాసిప్స్

రష్మిక మందన్నా, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా బాలీవుడ్ చిత్రం ‘కాక్టెయిల్ 2’. హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి చుట్టూ సాగే రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు.
తాజాగా ‘కాక్టెయిల్ 2’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2012లో దీపికా పదుకొణె, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాక్టెయిల్’ చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీ రూపొందింది. థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందనే ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!