

ఈరోజు సెప్టెంబర్ 18 శుక్రవారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాల సందడి మొదలైంది. తెలుగు, తమిళ, మలయాళ భాషలకు చెందిన పలు చిత్రాలు డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. ముఖ్యంగా రవితేజ నటించిన ‘ఇరుముడి’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ తండ్రి పాత్రలో కనిపిస్తారు.
ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ‘లస్ట్ స్టోరీస్ 3’, ‘మోధ రాతిరి’ కూడా ఇవాళ్టి నుంచి అందుబాటులో ఉన్నాయి. జియోహాట్‌స్టార్‌లో మలయాళ చిత్రం ‘తుడక్కం’, సన్‌నెక్స్ట్‌లో ‘అంగీకారం’, సైనా ప్లేలో ‘ఇడి మళా కట్టు’, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘రామ్ అండ్ లీలా’ స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో ఈ వీకెండ్‌లో యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్, స్పోర్ట్స్ వంటి విభిన్న జానర్లను ఓటీటీ ప్రేక్షకులు ఎంచుకోవచ్చు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!