

ప్రముఖ హిందీ క్రైమ్ డ్రామా సిరీస్ ‘మీర్జాపూర్’ ఆధారంగా రూపొందిన సినిమా సెప్టెంబర్ 4, 2026న హిందీ, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ చిత్రం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. అయితే థియేటర్లలో చూసిన వెర్షన్తో పోలిస్తే ఓటీటీ వెర్షన్ కొంత ఎక్కువ నిడివితో ఉండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. థియేట్రికల్ వెర్షన్ 3 గంటల 17 నిమిషాలు ఉండగా, డిజిటల్ వెర్షన్లో అదనంగా 14 నిమిషాల ఫుటేజ్ ఉన్నట్లు సమాచారం. ఈ అదనపు నిడివిలో ఏయే సన్నివేశాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే తెలుగు వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మాత్రం నిరాశ ఎదురైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేదు. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ ఏ-సర్టిఫికెట్ క్రైమ్ డ్రామాలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ, జితేంద్ర శర్మ, రవికిషన్, శ్వేతా త్రిపాఠి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప్రస్తుతం హిందీ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుండటంతో తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ వెర్షన్ విడుదల కోసం ఎదురుచూడాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!