

ఈ శుక్రవారం ఓటీటీ ప్రేక్షకులకు మినీ దీపావళి సందడి తీసుకురానుంది. అక్టోబర్ 30, 2026న వివిధ ఓటీటీ వేదికలపై మొత్తం 18 సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు విడుదలకు సిద్ధమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు పలు భాషల్లో కొత్త కంటెంట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఎస్ఐ యుగంధర్, సందీప్ కిషన్ నటించిన సిగ్మా, కీర్తి సురేశ్ నటించిన అక్క, ఇమ్మోర్టల్ వంటి చిత్రాలు ఆసక్తి పెంచుతున్నాయి. అలాగే రుద్రవనం పీఎస్ అనే తెలుగు వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్‌కు రానుంది. మరోవైపు ఆదర్శ కుటుంబం, కల్ట్, కిల్లర్ సినిమాలు ఈ వారాంతంలో థియేటర్లలో సందడి చేయనున్నాయి.
అక్టోబర్ 30న విడుదలయ్యే ఓటీటీ కంటెంట్ వివరాలు ఇవే:
నెట్‌ఫ్లిక్స్:
- అవరచన్ అండ్ బాయ్స్ – తెలుగు డబ్బింగ్ సినిమా
- ఎస్ఐ యుగంధర్ – తెలుగు సినిమా
- అక్క – తెలుగు డబ్బింగ్ సిరీస్
- సిగ్మా – తెలుగు డబ్బింగ్ సినిమా
- హౌ టు రూయిన్ దివాళి: మీట్ ద పేరెంట్స్ – దక్షిణాఫ్రికా సిరీస్
- ఏ కపుల్ ఆఫ్ లైస్ – స్వీడిష్ సిరీస్
- కొలిజన్ కోర్స్ – స్పానిష్ సినిమా
- డెడ్ ఎండ్ జాబ్ – కొరియన్ సిరీస్
- మీథే మే క్యాన్ హై – హిందీ సిరీస్
- అబ్సెస్ – అరబ్ సిరీస్
- ఎస్‌సీటీవీ: ద గ్రేట్ షో యూ నెవర్ హెర్డ్ ఆఫ్ – కెనడియన్ షో
జియో హాట్‌స్టార్:
- లవ్ ఆల్వేస్ – తెలుగు డబ్బింగ్ సిరీస్
- అబ్సెషన్: ద ఒరిజినల్ అన్‌కట్ వెర్షన్ – ఇంగ్లీష్ సినిమా
అమెజాన్ ప్రైమ్ వీడియో:
- అపోకలిప్స్ జెడ్: న్యూ వరల్డ్ – ఇంగ్లీష్ సినిమా
- ది డార్క్ హెవెన్ – తమిళ సినిమా
సోనీ లివ్:
- ఇమ్మోర్టల్ – తెలుగు డబ్బింగ్ సినిమా
జీ5:
- రుద్రవనం పీఎస్ – తెలుగు సిరీస్
ఆపిల్ టీవీ ప్లస్:
- నోక్టర్న్ – ఇంగ్లీష్ సిరీస్




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!