

కామెడీతో ప్రేక్షకులను అలరించే నటుడు శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో ప్రేక్షకులను నవ్వించిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. సాయి చంద్, షైన్ టామ్ చాకో, సత్య తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. 1990ల నేపథ్యంలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఈ కథ సాగుతుంది.
తాడికొండ కళ్యాణ్ (శ్రీవిష్ణు) ఓ చిన్న పట్టణంలో థియేటర్‌ను లీజుకు తీసుకుని నడుపుతుంటాడు. అదే సమయంలో అడవుల్లో నక్సలైట్ దళాల ఏరివేత కోసం ఐపీఎస్ అధికారి జార్జ్‌కుట్టి (షైన్ టామ్ చాకో) రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో సితారాదేవి (మహిమా నంబియార్)తో కళ్యాణ్‌కు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్న సితార తల్లి సరస్వతమ్మ (రాధికా శరత్‌కుమార్)ను కాపాడిన ఆమెను ప్రేమించిన కళ్యాణ్, ఆ కుటుంబ ఆర్థిక కష్టాలను తీర్చాలని నిర్ణయించుకుంటాడు. స్నేహితుడు దుబాయ్ బాబు (సత్య) సాయంతో ఓ మార్గాన్ని ఎంచుకుంటాడు. అయితే ఆ నిర్ణయం అతడి జీవితాన్నే మార్చేస్తుంది. సాధారణ థియేటర్ నిర్వాహకుడిగా ఉన్న కళ్యాణ్ ‘కామ్రేడ్ కళ్యాణ్’గా ఎలా మారాడు? అడవుల్లోని నక్సలైట్ దళాలతో అతడికి ఉన్న సంబంధం ఏమిటి? అన్నది సినిమా కథ.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!