
జనరల్

'కేడీ: ది డెవిల్' జీ5 ఓటీటీ వేదికపై భారీ ఆదరణ పొందుతూ టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రేక్షకులు తెలుగు వెర్షన్‌ను విశేషంగా ఆదరిస్తున్నారు. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన తర్వాత ఈ యాక్షన్ డ్రామా ఓటీటీలో కూడా అదే జోరును కొనసాగిస్తూ పాన్ ఇండియా సినిమాల క్రేజ్‌ను మరోసారి నిరూపిస్తోంది.
దర్శకుడు ప్రేమ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ధ్రువ సర్జా ప్రధాన పాత్రలో శక్తివంతమైన నటనతో ఆకట్టుకున్నారు. 1970ల బెంగళూరు అండర్‌వరల్డ్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. భారీ నిర్మాణ విలువలు, మాస్ యాక్షన్ సన్నివేశాలు, నాణ్యమైన డబ్బింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ స్పందనతో జీ5లో ఈ సినిమా ట్రెండింగ్ జాబితాలో మరింత ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!