

మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పూజా మేరీ జాన్’ ఎట్టకేలకు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. సినిమా షూటింగ్ దాదాపు నాలుగేళ్ల క్రితమే పూర్తయినప్పటికీ పలు కారణాలతో థియేటర్లలో విడుదల కాలేదు. దీంతో ఎలాంటి థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా డిజిటల్ ప్రీమియర్‌కు వెళ్లనుంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి జీ5 వేదికగా హిందీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అనంతరం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
నవజ్యోత్ గులాటీ, విషాషా అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హుమా ఖురేషీ, విక్రమ్ సింగ్ చౌహాన్, విజయ్ రాజ్, చైతన్య వ్యాస్, రాజేష్ జైస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దినేష్ విజన్‌కు చెందిన మడాక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నిజం, నమ్మకం, అనుమానం వంటి అంశాల చుట్టూ ఆసక్తికరమైన కథనంతో రూపొందిన ఈ సినిమా మృణాల్ ఠాకూర్ కెరీర్‌లో విభిన్నమైన చిత్రంగా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!