

సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు, ఇతర డిజిటల్ కంటెంట్‌ను ఇంటర్నెట్ ద్వారా నేరుగా వీక్షించే అవకాశం కల్పిస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు భారత్‌లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. కేబుల్ లేదా శాటిలైట్ కనెక్షన్‌పై ఆధారపడకుండా మొబైల్, స్మార్ట్ టీవీ వంటి పరికరాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కంటెంట్ చూసే వెసులుబాటు ఉండటంతో ఓటీటీ వినియోగం భారీగా పెరుగుతోంది.
తాజా ఆర్‌మాక్స్ మీడియా నివేదిక ప్రకారం భారత్‌లో ఆన్‌లైన్ వీడియో కంటెంట్‌ను వీక్షించే వారి సంఖ్య 66.49 కోట్లకు చేరింది. ఇది దేశ జనాభాలో దాదాపు 45 శాతానికి సమానం. గతేడాది 60.12 కోట్లుగా ఉన్న ఆన్‌లైన్ వీడియో ప్రేక్షకుల సంఖ్య ఏడాదిలోనే 11 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
పెయిడ్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లలోనూ గణనీయమైన వృద్ధి నమోదైంది. యాక్టివ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లు 17.26 కోట్లకు చేరాయి. గతేడాది 14.82 కోట్లుగా ఉన్న ఈ సంఖ్యతో పోలిస్తే 16 శాతం వృద్ధి కనిపించింది. అంటే ఓటీటీ కంటెంట్‌ను వీక్షించడంతో పాటు స్ట్రీమింగ్ సేవలకు డబ్బులు చెల్లించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
అయితే ఈ నివేదికలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అంశం కనెక్టెడ్ టీవీ వినియోగం పెరగడం. స్మార్ట్ టీవీ లేదా ఇతర కనెక్టెడ్ టీవీల ద్వారా ఓటీటీ కంటెంట్ చూసే యూజర్ల సంఖ్య 20.69 కోట్లకు చేరింది. ఏడాదిలోనే ఇది 60 శాతం పెరగడం విశేషం. మొబైల్‌లో వ్యక్తిగతంగా కంటెంట్ చూసే అలవాటుతో పాటు కుటుంబంతో కలిసి టీవీలో ఓటీటీ చూసే విధానం కూడా వేగంగా పెరుగుతున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
ఒక్కో ప్రేక్షకుడు వారానికి సగటున 14.9 గంటల పాటు ఆన్‌లైన్ వీడియోలను చూస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. సోషల్ మీడియా వీడియోలు, షార్ట్ వీడియోలు, మైక్రో డ్రామాలు, ఫాస్ట్ ఛానెళ్లకు కూడా ప్రేక్షకాదరణ పెరుగుతోంది.
మొత్తంగా చూస్తే భారతీయుల ఎంటర్‌టైన్‌మెంట్ అలవాట్లు వేగంగా మారుతున్నాయి. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు ఇప్పుడు ఓటీటీ వినియోగానికి ప్రధాన స్క్రీన్‌లుగా మారుతున్నాయి. పెరుగుతున్న ప్రేక్షకులు, సబ్‌స్క్రిప్షన్లు, కనెక్టెడ్ టీవీ వినియోగం భారతదేశంలో డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌కు ఉన్న భారీ అవకాశాలను సూచిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!