

ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిద్ధమైంది. తమిళ నటుడు భరత్ కీలక పాత్రలో నటించిన తెలుగు వెబ్‌సిరీస్ పంచనామా. మోహన్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను ఉదయ భాను ప్రొడక్షన్స్ పతాకంపై విజయేంద్ర మౌళి, ఉదయభాను నిర్మిస్తున్నారు.
ఆదివారం విడుదలైన ట్రైలర్ సిరీస్‌పై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో భరత్ పోలీస్ అధికారిగా కనిపిస్తూ ఓ మిస్టరీ కేసును ఛేదించే ప్రయత్నం చేస్తారు. ప్రవీణ్, ఆది, జోసఫ్ అనే ముగ్గురు ఎందుకు చనిపోయారు? కొద్ది రోజుల తర్వాత లభించిన చేతులు ఎవరివి? వాటిని అక్కడికి తీసుకొచ్చింది ఎవరు? ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలు కథలో ఉత్కంఠను పెంచుతున్నాయి.
ఈ మిస్టరీలకు సమాధానాలు తెలుసుకోవాలంటే సిరీస్‌ను చూడాల్సిందే. శివాజీ రాజా, మేథారెడ్డి, రూప లక్ష్మి, శ్రీజ తదితరులు ఇందులో నటిస్తున్నారు. పంచనామా సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!