

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘దురంధర్-2’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన తర్వాత ఓటీటీలో కూడా సెన్సేషన్ సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. జూన్ 5 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, విడుదలైన కొద్ది రోజుల్లోనే కోట్లాది మంది వీక్షకులను సొంతం చేసుకుని మరో రికార్డు నమోదు చేసింది.
ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ మూవీ మరో ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో కూడా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఓవర్సీస్ ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న ఈ చిత్రం, జూన్ 19 నుంచి భారతీయ ప్రేక్షకుల కోసం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సారా అర్జున్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!