

సముద్రఖని, ఐశ్వర్య రాజేష్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్య, రాజీవ్ కనకాల, మైమ్ గోపి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ జులై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. విడుదలకు ముందు విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
పోర్ట్ ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ కథను ఇంటెన్స్ రివెంజ్ డ్రామాగా తీర్చిదిద్దారు. అక్రమ దందాలకు కేంద్ర బిందువుగా ఉన్న నాయుడిపై అతని కుమార్తె ఎందుకు తిరుగుబాటు చేసింది? తండ్రి, కుమార్తె మధ్య చోటుచేసుకునే సంఘర్షణ ఎలాంటి పరిణామాలకు దారితీసింది? అనే అంశాల చుట్టూ కథ సాగుతుంది. శక్తివంతమైన సంభాషణలు, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులకు విభిన్న అనుభూతిని అందించనుంది. తెలుగు సహా 15 భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!