31, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రక్షణ ప్రయత్నాలు విఫలం.. భూమివైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌

Writer: Nithish 07:59 PM, 31 అక్టోబర్, 2026
రక్షణ ప్రయత్నాలు విఫలం.. భూమివైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌

దాదాపు 22 ఏళ్లుగా అంతరిక్షంలో సేవలందిస్తున్న నాసాకు చెందిన ‘స్విఫ్ట్‌ అబ్జర్వేటరీ’ టెలిస్కోప్‌ త్వరలో భూమిపైకి కూలిపోనుంది. దాన్ని రక్షించేందుకు చేపట్టిన ప్రయత్నాలు విఫలం కావడంతో కక్ష్య నుంచి క్రమంగా దిగజారుతోంది. ఈ నేపథ్యంలో టెలిస్కోప్‌ త్వరలోనే భూమి వాతావరణంలోకి ప్రవేశించి కూలిపోయే అవకాశం ఉందని అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ అంచనా వేస్తోంది. సుమారు ఒకటిన్నర టన్నుల బరువున్న ఈ టెలిస్కోప్‌లో ఎక్కువ భాగం వాతావరణంలోనే కాలిపోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, కొన్ని భాగాలు, అద్దాల ముక్కలు భూమిని చేరే అవకాశం ఉందని మిషన్‌ ముఖ్య శాస్త్రవేత్త బ్రాడ్‌ సెంకో తెలిపారు.

2004 నవంబర్‌ 20న ప్రయోగించిన స్విఫ్ట్‌ అబ్జర్వేటరీ.. విశ్వంలోని అత్యంత శక్తిమంతమైన విస్ఫోటనాలైన గామా కిరణాల విస్ఫోటనాలు (గామా రే బరస్ట్స్‌), సూపర్‌నోవాలను పరిశీలించేందుకు రూపొందించారు. దీన్ని రక్షించే బాధ్యతను నాసా ‘కాటలిస్ట్‌ స్పేస్‌’ సంస్థకు అప్పగించింది. అయితే, ఈ ఏడాది జులైలో ఆ సంస్థ ప్రయోగించిన ‘లింక్‌’ అనే మూడు చేతుల రోబో మిషన్‌ విఫలమైంది. ఆ రోబో సెప్టెంబర్‌లో భూమిపై కూలిపోయింది. పరిస్థితి మరింత దిగజారడంతో అక్టోబర్‌లో స్విఫ్ట్‌ టెలిస్కోప్‌లోని వ్యవస్థలను నిలిపివేశారు. తన సేవాకాలంలో ఈ అబ్జర్వేటరీ 2,000కు పైగా గామా రే బరస్ట్స్‌, 1,400 సూపర్‌నోవాలతో పాటు అనేక తోకచుక్కలు, గ్రహశకలాలు, బ్లాక్‌ హోల్స్‌ను పరిశీలించింది. అంతరిక్షంలో ఎక్కడైనా విస్ఫోటనం సంభవించినప్పుడు ఆ దిశగా వేగంగా తిరిగి పరిశీలించడం దీని ప్రత్యేకత. అందుకే దీనికి ‘స్విఫ్ట్‌’ అనే పేరు పెట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం.. రాయపాటి శైలజ భరోసా

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం.. రాయపాటి శైలజ భరోసా

ఓటర్ల జాబితా వివాదంపై కాంగ్రెస్‌కు కిషన్‌ రెడ్డి సవాల్‌

ఓటర్ల జాబితా వివాదంపై కాంగ్రెస్‌కు కిషన్‌ రెడ్డి సవాల్‌

డేటోనా బీచ్‌ ర్యాలీలో కంటి సమస్యతో ఇబ్బంది పడ్డ ట్రంప్‌.. ఆరోగ్యంపై మళ్లీ చర్చ

డేటోనా బీచ్‌ ర్యాలీలో కంటి సమస్యతో ఇబ్బంది పడ్డ ట్రంప్‌.. ఆరోగ్యంపై మళ్లీ చర్చ

అమెరికాలో భారతీయుడికి భారీ ప్రాజెక్ట్‌

అమెరికాలో భారతీయుడికి భారీ ప్రాజెక్ట్‌

తెలంగాణలో క్రాప్‌ హాలిడే లేదు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

తెలంగాణలో క్రాప్‌ హాలిడే లేదు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహ బంధంలోకి ఒమర్‌ అబ్దుల్లా

జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహ బంధంలోకి ఒమర్‌ అబ్దుల్లా

ట్యాగ్లు
నాసాస్విఫ్ట్‌ అబ్జర్వేటరీస్విఫ్ట్‌ టెలిస్కోప్‌అంతరిక్షంఅమెరికా స్పేస్‌ ఫోర్స్‌గామా రే బరస్ట్స్‌సూపర్‌నోవాలుకాటలిస్ట్‌ స్పేస్‌ఖగోళ పరిశోధనలుఅంతరిక్ష వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజకీయ వ్యాఖ్యలతో ప్రకాశ్‌రాజ్‌కు సినిమా అవకాశాలు దూరం.. భార్య పోనీ వర్మ కీలక వ్యాఖ్యలు
సినిమాలు

రాజకీయ వ్యాఖ్యలతో ప్రకాశ్‌రాజ్‌కు సినిమా అవకాశాలు దూరం.. భార్య పోనీ వర్మ కీలక వ్యాఖ్యలు

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం.. రాయపాటి శైలజ భరోసా
జనరల్

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం.. రాయపాటి శైలజ భరోసా

‘ఆదర్శ కుటుంబం’లో ఆ పాటను పక్కన పెట్టేయడానికి కారణమిదేనా?
గాసిప్స్

‘ఆదర్శ కుటుంబం’లో ఆ పాటను పక్కన పెట్టేయడానికి కారణమిదేనా?

సాయి రాజేశ్‌ నిర్మాణంలో మరో ప్రేమకథా చిత్రం
సినిమాలు

సాయి రాజేశ్‌ నిర్మాణంలో మరో ప్రేమకథా చిత్రం

‘ఎల్లమ్మ’ కోసం డీఎస్పీ భారీ ప్రయోగం
సినిమాలు

‘ఎల్లమ్మ’ కోసం డీఎస్పీ భారీ ప్రయోగం

రక్షణ ప్రయత్నాలు విఫలం.. భూమివైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌
జనరల్

రక్షణ ప్రయత్నాలు విఫలం.. భూమివైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌

రావణుడిగా నటిస్తున్నానని తెలిసి షాకైన యశ్‌ కుమారుడు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నటుడు
సినిమాలు

రావణుడిగా నటిస్తున్నానని తెలిసి షాకైన యశ్‌ కుమారుడు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నటుడు

బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ గుప్తా కన్నుమూత
సినిమాలు

బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ గుప్తా కన్నుమూత

ఓటర్ల జాబితా వివాదంపై కాంగ్రెస్‌కు కిషన్‌ రెడ్డి సవాల్‌
జనరల్

ఓటర్ల జాబితా వివాదంపై కాంగ్రెస్‌కు కిషన్‌ రెడ్డి సవాల్‌

డేటోనా బీచ్‌ ర్యాలీలో కంటి సమస్యతో ఇబ్బంది పడ్డ ట్రంప్‌.. ఆరోగ్యంపై మళ్లీ చర్చ
జనరల్

డేటోనా బీచ్‌ ర్యాలీలో కంటి సమస్యతో ఇబ్బంది పడ్డ ట్రంప్‌.. ఆరోగ్యంపై మళ్లీ చర్చ

ఆస్ట్రేలియాతో టెస్టులో చరిత్ర సృష్టించిన కగిసో రబాడ
క్రీడలు

ఆస్ట్రేలియాతో టెస్టులో చరిత్ర సృష్టించిన కగిసో రబాడ

అమెరికాలో భారతీయుడికి భారీ ప్రాజెక్ట్‌
జనరల్

అమెరికాలో భారతీయుడికి భారీ ప్రాజెక్ట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!