

రామాయణం ఇతిహాసం ఆధారంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’లో కన్నడ నటుడు యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. అయితే, తాను రాముడి పాత్ర కాకుండా రావణుడిగా నటిస్తున్నానని చెప్పినప్పుడు తన కుమారుడు ఆశ్చర్యపోయాడని యశ్ వెల్లడించారు. రామాయణం కథను కుమారుడికి వివరించి, రావణుడి పాత్రలో నటించడం అంటే అతడి చెడు పనులను సమర్థించడం కాదని చెప్పినట్లు తెలిపారు. రాముడిలోని విలువలు, సద్గుణాలను ఆదర్శంగా తీసుకోవాలని పిల్లలకు వివరించానన్నారు.
తెరపై తండ్రి నటనను చూసి ఆనందించవచ్చని, కానీ రావణుడి పాత్రను స్ఫూర్తిగా తీసుకోవద్దని కుమారుడికి చెప్పినట్లు యశ్ తెలిపారు. అయితే, సినిమా చివర్లో యుద్ధంలో ఓడిపోయి రావణుడు చనిపోతాడా అని తన కుమారుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమైందన్నారు. నటుడికి, ఆయన పోషించే పాత్రకు మధ్య ఉన్న తేడాను అర్థమయ్యేలా వివరించాల్సి వచ్చిందని చెప్పారు. మరోవైపు, నవంబరు 5న విడుదల కానున్న ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి స్పందన వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లో శనివారం ఉదయానికి నాలుగు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవగా, ముందస్తు బుకింగ్స్ ద్వారా సుమారు రూ.20 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ మొత్తం రూ.40 కోట్లకు చేరినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!