

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ జీవితంలోని ఆసక్తికరమైన ఘట్టాలు ఇప్పుడు వెబ్‌సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సచిన్ టెండూల్కర్‌తో కలిసి క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించిన కాంబ్లీ.. ఒక దశలో ప్రతిభావంతమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అనూహ్య పరిణామాలతో ఆయన క్రికెట్ కెరీర్ ఆశించిన స్థాయిలో కొనసాగలేదు. క్రీడా జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనుభవాలను కూడా ఈ వెబ్‌సిరీస్‌లో చూపించనున్నట్లు సమాచారం. దీంతో కాంబ్లీ జీవిత కథపై ఆసక్తి నెలకొంది.
ఈ వెబ్‌సిరీస్‌కు అభిజీత్ దేశ్‌పాండే దర్శకత్వం వహించనున్నారు. వి. శాంతారామ్ బయోపిక్ వాయిదా పడిన నేపథ్యంలో ఆయన వినోద్ కాంబ్లీ కథపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కథలోని విస్తృతమైన అంశాలను పూర్తిస్థాయిలో చూపించేందుకు సినిమాకు బదులుగా వెబ్‌సిరీస్ రూపాన్ని ఎంచుకున్నట్లు దర్శకుడు వెల్లడించారు. జీ5తో కలిసి సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ నిర్మించిన రవి భగచంద్కా ప్రొడక్షన్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. కాంబ్లీ క్రికెట్ ప్రయాణం, వ్యక్తిగత జీవితంలోని మలుపులు, కెరీర్లో ఎదురైన పరిణామాలు ఈ కథకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!