
గాసిప్స్

నెట్‌ఫ్లిక్స్ మరో క్రేజీ కొరియన్ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ‘హస్బెండ్స్ ఇన్ యాక్షన్’ అనే బడ్డీ యాక్షన్-కామెడీ చిత్రం జూన్ 19, 2026న స్ట్రీమింగ్కు రానుంది. భారతీయ ప్రేక్షకులు ఈ సినిమాను మధ్యాహ్నం 12:30 గంటల నుంచి వీక్షించవచ్చు. యాక్షన్, కామెడీ, వేగవంతమైన కథనంతో రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
అనూహ్య మలుపులు, వినోదాత్మక సన్నివేశాలు, హీరోల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో వివిధ భాషల ఆడియో, సబ్‌టైటిల్ ఎంపికలు అందుబాటులో ఉండగా, తెలుగు డబ్బింగ్‌పై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. యాక్షన్‌తో పాటు వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి వీకెండ్ ట్రీట్‌గా మారనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!