

అన్నమయ్య జిల్లాలో ప్రతిపాదించిన పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ రద్దుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి ప్రశ్నలు సంధించారు. చింతలపాల్యం, కొమ్మూరు, చిట్టడవి ప్రాంతాల్లో సుమారు రూ.10,300 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉద్యోగాలు, విద్యుత్ నిల్వ సామర్థ్యం పెరుగుతుందని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్ట్‌ను ఎందుకు రద్దు చేసిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
పర్యావరణ సమస్యలు, ప్రాంతం సున్నితమైనదిగా ఉండటాన్ని ప్రాజెక్ట్ రద్దుకు కారణాలుగా చూపుతున్నారని భూమన కరుణాకర రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్ట్ ప్రకటించిన సమయంలో ఈ అంశాలు ప్రభుత్వానికి తెలియవా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో పలు పెట్టుబడులు, ప్రాజెక్టుల పురోగతిపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ప్రాజెక్ట్ రద్దు వెనుక వాస్తవ కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!