

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకాలను భారీగా పెంచాలని నిర్ణయించింది. మూడు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో, తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ క్రమంలో ప్రోత్సాహకాల పెంపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయనుందని సమాచారం.
ప్రతిపాదిత కొత్త విధానం ప్రకారం, 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీ ఏకగ్రీవమైతే రూ.15 లక్షలు అందించనున్నారు. 5,001 నుంచి 10 వేల మధ్య జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు. గతంలో నాలుగు కేటగిరీల్లో రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందించేవారు. ఇప్పుడు కేటగిరీలను మూడుకు తగ్గించి, గరిష్ట మొత్తాన్ని రూ.50 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!