

రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 11 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఒడిశాలో జరగనున్న ఉప ఎన్నికకు పోటీ చేసే అభ్యర్థి కూడా ఉన్నారు. రాజ్యసభలో ఖాళీ అయ్యే స్థానాలకు రెండేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఖాళీల భర్తీ కోసం జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేశారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. రాజస్థాన్ నుంచి సతీష్ పూనియా, అల్కా గుర్జార్, మధ్యప్రదేశ్ నుంచి తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి తాయ్ తగాక్, గుజరాత్ నుంచి రాజుభాయ్ శుక్లా, ముకేష్ భాయ్ రత్వా, మాన్‌సింగ్ పర్మార్, జితేంద్ర మేఘ్‌జిభాయ్ కంజారియా, మణిపూర్ నుంచి శార్దా దేవి, ఒడిశా నుంచి దేవాసిష్ సమంతరాయ్ బీజేపీ తరఫున బరిలో నిలిచారు. జూన్ 18న 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగగా, వాటిలో మూడు టీడీపీకి, ఒకటి జనసేనకు దక్కాయి. తమిళనాడులో టీవీకే కూటమి ఒక రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!