

భీమవరం మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. టీడీపీ, జనసేన నాయకులు బీజేపీకి కనీస సమాచారం ఇవ్వకుండా సొంతంగా అభ్యర్థుల జాబితాలను ప్రకటించడంపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది బీజేపీని అవమానించడమేనని, కూటమిలో తమ పార్టీకి తగిన గౌరవం ఇవ్వాలని స్పష్టం చేశారు.
మొత్తం 52 వార్డుల్లో బీజేపీకి సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని శ్రీనివాస వర్మ ఆరోపించారు. ఐదు వార్డులు కేటాయిస్తామని చెప్పి, అవి ఏవో కూటమి నాయకులే నిర్ణయించడం సరికాదన్నారు. తన ఇంటి పక్కన ఉన్న వార్డులను కేటాయించడం కంటే బీజేపీకి బలమైన క్యాడర్ ఉన్న ప్రాంతాల్లో సీట్లు ఇవ్వాలని కోరారు. సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ కుమారుడికి కూడా టికెట్ ఇవ్వలేదని ప్రస్తావించారు. బీజేపీకి సొంతంగా అన్ని స్థానాల్లో పోటీ చేసే బలం ఉందని, పొత్తులో కేటాయించే స్థానాల కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకునే సత్తా తమకు ఉందని అన్నారు. 1981 నుంచి జరిగిన ప్రతి మున్సిపల్ ఎన్నికలోనూ బీజేపీకి ప్రాతినిధ్యం ఉందని గుర్తుచేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!