

ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అంశంలో ఎన్నికల సంఘానికి ప్రశ్నావళి పంపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన పలువురు విపక్ష నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం సమర్పించిన వివరణలో తమ సందేహాలకు సమాధానాలు లభించలేదని విపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై స్పష్టత కోరుతూ ప్రశ్నావళిని సమర్పించేందుకు అనుమతించాలని వారు న్యాయస్థానాన్ని కోరారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియను ఎవరు ఆదేశించారు? ఎన్నికల సంఘం నిర్ణయాలు ఎలా తీసుకుంది? వంటి అంశాలపై వివరణ కోరుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు న్యాయపోరాటాన్ని కొనసాగిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!