
జనరల్

గుజరాత్లోని మంజల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి సతీష్ పటేల్ విజయం సాధించారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ మెజారిటీ గణనీయంగా తగ్గడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానంలో బీజేపీ లక్షకు పైగా మెజారిటీ సాధించగా, తాజా ఉప ఎన్నికలో ఆ ఆధిక్యం సుమారు 30 వేలకు పడిపోయింది.
బీజేపీకి కంచుకోటగా ఉన్న మంజల్పూర్ నియోజకవర్గంలో మెజారిటీ తగ్గడం పార్టీకి హెచ్చరికగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉప ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కొత్త చర్చకు తెరలేపాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!