

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి. పద్మ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ కావడం, ఇటీవల పలువురు కేంద్ర మంత్రులకు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించడం వంటి పరిణామాలు మంత్రివర్గ మార్పులపై ఊహాగానాలకు బలం చేకూర్చాయి. దీంతో త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.
రాజ్యసభ పదవీకాలం ముగియడంతో కేంద్ర సహాయ మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేయగా, రాష్ట్రపతి దానిని ఆమోదించారు. ఇదే సమయంలో రవ్‌నీత్ సింగ్ బిట్టూ, హర్ష్ మల్హోత్రా, పంకజ్ చౌదరి వంటి నేతలు పార్టీ బాధ్యతలపై దృష్టి సారించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు పంజాబ్‌కు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!