
జనరల్

రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయ ఏనుగు రామలక్ష్మి ఫిల్టర్ కాఫీ ఆస్వాదిస్తూ తాగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆలయంలో ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో గురువారం రాత్రి పార్వతవర్ధిని అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ముందు ఆలయ ఏనుగు రామలక్ష్మి నడిచింది.
దక్షిణ మాడ వీధిలో ఊరేగింపు సాగుతున్న సమయంలో ఓ భక్తుడు రామలక్ష్మికి ఫిల్టర్ కాఫీ అందించాడు. మావటి రాము ఆ కాఫీని ఏనుగుకు తాగించాడు. రామలక్ష్మి కాఫీని ఆస్వాదిస్తూ తాగుతున్న దృశ్యాలను అక్కడున్న భక్తులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!