

నయనతార, కవిన్ జంటగా నటించిన ‘హాయ్’ చిత్రం ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె. భాగ్యరాజ్, రాధికా శరత్‌కుమార్, ప్రభు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా దర్శకుడు విష్ణు మాట్లాడుతూ.. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, హాస్యంతో కూడిన మంచి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా ‘హాయ్’ రూపొందిందని తెలిపారు. కుటుంబ సమేతంగా ఆస్వాదించేలా సినిమా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది.
ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతం అందించగా.. రాజేశ్ శుక్లా ఛాయాగ్రహణం నిర్వహించారు. నయనతార, కవిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, వినోదానికి ప్రాధాన్యమిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఆగస్టు 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!