
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్‌రావుపై బేగంబజార్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కైలాష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. ఫిర్యాదు ప్రకారం, టెలివిజన్ కార్యక్రమంలో సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో యాంకర్ పాత్రపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, కార్యక్రమంలో నాగార్జున అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ, కొమ్మినేని శ్రీనివాస్‌రావు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు విచారిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!