

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయింపు కేసులో సెప్టెంబర్ 18న తెలంగాణ హైకోర్టు ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ సెప్టెంబర్ 19న దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సెప్టెంబర్ 21న విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.
మరోవైపు, దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని భావించిన బీఆర్‌ఎస్ ముందుగానే కేవియట్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. దానం నాగేందర్ పిటిషన్‌పై విచారణ జరిగితే తమ వాదన కూడా వినాలని బీఆర్‌ఎస్ కేవియట్ ద్వారా కోరినట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, స్పీకర్ ఉత్తర్వులను పక్కనపెట్టి ఆయనపై అనర్హత వేటు వేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!