

బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లో త్రిగుణ్ తన గేమ్ ప్లాన్‌ను మార్చినట్లు తాజా పరిణామాలు చూపిస్తున్నాయి. ఇప్పటివరకు రోహిత్‌ను బలమైన పోటీదారుడిగా భావించి అతడితో తరచూ వాగ్వాదానికి దిగిన త్రిగుణ్.. ఇప్పుడు రోహిత్‌తో చేతులు కలిపేందుకు ప్రయత్నించాడు. ‘‘మనిద్దరం కలిసి ఆడితే హౌస్‌లో ఎవరూ అడ్డుకోలేరు’’ అంటూ రోహిత్‌ను ఒప్పించి సంధికి ప్రయత్నించాడు. మరోవైపు కెప్టెన్సీ టాస్క్ నుంచి తనను తప్పించడంపై ముకేష్‌తో త్రిగుణ్ మాటల యుద్ధానికి దిగాడు. ‘‘దమ్ముంటే ఎదురురా’’ అంటూ తొడగొట్టి ముకేష్‌ను సవాల్ చేశాడు.
త్రిగుణ్ వ్యాఖ్యలపై ముకేష్ కూడా స్పందించాడు. అవసరమైతే తాను కూడా డబుల్ గేమ్ ఆడగలనని, త్రిగుణ్ కంటే ఎక్కువ వ్యూహాలు తనకు తెలుసని వ్యాఖ్యానించాడు. అనంతరం వర్షిణితో మాట్లాడిన త్రిగుణ్.. ముకేష్ తనపై ఎందుకు కోపంగా ఉన్నాడో అర్థం కావడం లేదని చెప్పాడు. ఇదిలా ఉండగా, హౌస్ కెప్టెన్సీ పోటీ చివరి దశకు చేరుకోగా ఝాన్సీ, రాం ప్రసాద్ మధ్య తుది పోటీ నెలకొంది. ఫైనల్ టాస్క్‌లో రాం ప్రసాద్‌పై విజయం సాధించిన ఝాన్సీ బిగ్‌బాస్ తెలుగు 10 తొలి కెప్టెన్‌గా నిలిచినట్లు తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!