
జనరల్

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న సంస్థలకు అనుకూలంగా, ఇతర స్వచ్ఛంద సంస్థలపై కఠిన నిబంధనలు విధించేలా ఎఫ్‌సీఆర్‌ఏ చట్టాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇది పాలన కాదని, చట్టం పేరుతో అధికార దుర్వినియోగమని విమర్శించారు.
ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లు స్వతంత్ర గొంతులను అణిచివేసేందుకు, వివక్షను ప్రోత్సహించేందుకు ప్రయత్నమని షర్మిల పేర్కొన్నారు. సమాజ సేవ చేసే సంస్థలపై ప్రభుత్వం నియంత్రణ విధించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బిల్లుపై స్పష్టమైన వైఖరి ప్రకటించారని, స్వేచ్ఛను దెబ్బతీసే చర్యలను అడ్డుకుంటామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!