
రాజకీయాలు

సముద్ర పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విశేష కృషికి గుర్తింపుగా సెషెల్స్ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారమైన ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హరైజన్’ ను ప్రదానం చేసింది. వాతావరణ మార్పుల నియంత్రణ, గ్రీన్ గ్రోత్, సముద్ర వనరుల బాధ్యతాయుత నిర్వహణలో ఆయన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఈ గౌరవం అందజేసింది.
ప్రెసిడెన్షియల్ సైటేషన్‌లో చిన్న ద్వీప దేశాలకు భారత్ అందిస్తున్న మద్దతు, అంతర్జాతీయ సహకార విస్తరణలో మోదీ పాత్రను ప్రత్యేకంగా పేర్కొంది. ఈ అవార్డు భారత్–సెషెల్స్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని తెలిపింది. ఈ గౌరవంపై మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాల కృషికి ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు చెప్పారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!