

మిడ్ మానేరు నుంచి గోదావరి జలాలను నిరంతరం ఎత్తిపోస్తూ రంగనాయక సాగర్ రిజర్వాయర్‌ను నింపాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లిలో ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 500 ఈత మొక్కల నాటే కార్యక్రమంలో సర్పంచి రేణుకతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రంగనాయక సాగర్‌లోకి ప్రస్తుతం ఎనిమిది గంటలు మాత్రమే నీటిని పంపింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు కట్టల వెంట ఈత చెట్లను పెంచి గీత కార్మికులకు ఉపాధి కల్పించామని, పలు సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. ఈ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. రంగనాయక సాగర్‌లోకి కాళేశ్వరం జలాలను ఎత్తిపోసే అంశంపై హరీశ్‌రావు గతంలోనూ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
పెండింగ్‌లో ఉన్న రెండు లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ఇవ్వకుండా 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుందని హరీశ్‌రావు ప్రశ్నించారు. కార్యక్రమంలో భాగంగా సేంద్రియ ఎరువు తయారు చేసే యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం నర్మెట్టలోని విద్యుత్ ఉపకేంద్రాన్ని ఆయన పరిశీలించారు. గోదావరి వరద జలాలను వినియోగించి రిజర్వాయర్లను నింపాలని, కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను నిరంతరం నడపాలని హరీశ్‌రావు ఇటీవల కూడా ప్రభుత్వాన్ని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!