

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనతో దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన కోసం జంతర్ మంతర్ వైపు వెళ్తున్న విపక్ష ఎంపీల బస్సులను దిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమానికి ముందస్తు అనుమతి అవసరమని పోలీసులు తెలిపారు. దీంతో జంతర్ మంతర్ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించి, పలు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు.
పోలీసులు బస్సులను అడ్డుకోవడంతో పలువురు కాంగ్రెస్ ఎంపీలు బస్సులపైకి ఎక్కి సీఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రియాంకా గాంధీ వాద్రా సహా పలువురు మహిళా ఎంపీలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు పలువురు విపక్ష ఎంపీలను అదుపులోకి తీసుకుని నిరసన ప్రదేశం నుంచి తరలించారు. పోలీసుల చర్యపై ప్రియాంకా గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!