

తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, ముఖ్య నాయకులతో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై కవిత దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్రధాన ఎజెండా పాంచజన్యాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు. సామాజిక న్యాయ తెలంగాణ లక్ష్యాలు, పార్టీ విధానాలను ప్రజలకు వివరించి విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలు నిర్వహించాలని కవిత సూచించారు. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన సంస్థాగత చర్యలు, ప్రజా సంబంధ కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నాయకులకు వివరించారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసి, సామాజిక న్యాయ లక్ష్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!