

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలపై కొండా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు స్టేట్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అనిత జక్కని తీవ్రంగా స్పందించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే హక్కు సుష్మితకు ఏముందని ప్రశ్నించారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదా పదవి ఉందా అని నిలదీశారు. పరకాల నుంచి పోటీ చేస్తానని, కాంగ్రెస్ టికెట్ తనదేనని సుష్మిత ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై సుష్మిత చేసిన వ్యాఖ్యలను కూడా అనిత జక్కని తప్పుబట్టారు.
సుష్మిత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటే చేసుకోవచ్చని, అయితే కాంగ్రెస్ జెండాలు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చిత్రాలను ఎందుకు ఉపయోగిస్తున్నారని అనిత ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ‘అచ్చ కాంగ్రెస్’, ‘పచ్చ కాంగ్రెస్’ అంటూ మాట్లాడుతున్న సుష్మిత గతంలో ఏ పార్టీలో ఉన్నారో గుర్తు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె వ్యాఖ్యలకు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!