
జనరల్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యువతకు ఉపాధి, అవకాశాల అంశంపై మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో కొత్త స్టార్టప్ వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని, యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా కెరీర్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఈ అంశాలపై విపక్ష నేతలు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు.
రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్‌ను ఉద్దేశించి యోగి ఆదిత్యనాథ్.. “రాహుల్ జీ, అఖిలేశ్ యాదవ్ జీ.. మీరు చదువుకున్నవారో కాదో నాకు తెలియదు” అని వ్యాఖ్యానించారు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగం, ఉపాధి అవకాశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో యోగి చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వాగ్వాదానికి దారితీశాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!