
జనరల్

వరంగల్ జిల్లాకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ భారతీయ సూక్ష్మ కళా చరిత్రలో అరుదైన ఘనత సాధించారు. ఆయన రూపొందించిన సూక్ష్మ కళాఖండాలు విక్రమ్-1 రాకెట్ ద్వారా జూలై 12 నుంచి ఆగస్టు 4 వరకు అంతరిక్షంలో ప్రయాణించనున్నట్లు స్కైరూట్ ఎరోస్పేస్ అధికారికంగా ప్రకటించింది. భారతీయ మైక్రో ఆర్ట్ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్తుండటం విశేషంగా నిలిచింది.
సూది రంధ్రంలో సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిరూపాలను రూపొందించేందుకు అజయ్ కుమార్ దాదాపు 140 గంటలు శ్రమించారు. స్టెయిన్లెస్ స్టీల్, 24 క్యారెట్ల బంగారం, వెండి, సిరామిక్ పొడి, కార్బన్ ఫైబర్ పొడి వంటి ప్రత్యేక పదార్థాలతో ఈ కళాఖండాలను రూపొందించారు. 40 ఏళ్లుగా చేస్తున్న తన కళకు ఈ గుర్తింపు లభించడం ఎంతో గర్వకారణమని ఆయన తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!