
రాజకీయాలు

ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ ఖరారైంది. జూన్ 15 నుంచి 17 వరకు ఎవియన్ లే బైన్స్‌లో జరగనున్న ఈ సదస్సులో ఇద్దరు నేతలు కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించింది.
భాగస్వామ్య దేశంగా ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. గత ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సమయంలో చివరిసారిగా ఇద్దరు నేతలు సమావేశమయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!