
సినిమాలు

జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల వేధింపుల అంశంపై లోక్‌సభలో ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నీట్ పేపర్ లీక్ ఘటనను ప్రస్తావిస్తూ విద్యార్థుల పరిస్థితిపై ఆమె ప్రశ్నించగా, ముందు కాంగ్రెస్ పార్టీ తన గత చరిత్రను పరిశీలించుకోవాలని ఆయన సూచించారు.
1969 తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పుల్లో 369 మంది విద్యార్థులు మరణించారని, వారిని ఉగ్రవాదులుగా భావించారా అని ప్రశ్నించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సుమారు 1,200 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అలాగే ఎమర్జెన్సీ సమయంలో వేలాది మంది విద్యార్థులను జైలుకు పంపి అణచివేశారని ఆరోపించారు. అధికారంలో లేనప్పుడు మాత్రమే కాంగ్రెస్‌కు హక్కులు గుర్తొస్తాయని కిషన్ రెడ్డి విమర్శించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!