
రాజకీయాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మెట్రోకు కేంద్రం నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే తాము రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరమని పేర్కొన్నారు.
అదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కిషన్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి తనను తరిమికొడతానని వ్యాఖ్యానించారని పేర్కొంటూ, తాను బీఆర్ఎస్ కార్యకర్తను కాదని, బీజేపీ కార్యకర్తనని స్పష్టం చేశారు. ఈ గడ్డపై తనను తరిమికొట్టగల వ్యక్తి ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానిస్తూ రాజకీయంగా గట్టి సమాధానం ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!