
సినిమాలు

తమిళ నటి యషిక ఆనంద్, తెలుగు ప్రేక్షకులకు నోటా, జాంబీ, పాదం వంటి చిత్రాల ద్వారా కూడా పరిచయమే. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. గతంలో జరిగిన బ్రేకప్ తర్వాత ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా ఎవరితోనూ ప్రేమ సంబంధంలో లేనని, ప్రస్తుతం సింగిల్‌గా ఎంతో సంతోషంగా ఉన్నానని వెల్లడించింది.
తనను తాను ప్రేమించుకోవడం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకున్నానని యషిక తెలిపింది. అలాగే తమ ఇంట్లో బార్ ఏర్పాటు ఉండి స్నేహితులతో చిన్నపాటి గ్యాదరింగ్స్ జరుగుతాయని, అయితే తాను మాత్రం మద్యం సేవించనని స్పష్టం చేసింది. ప్రేమ, వ్యక్తిగత జీవితం గురించి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!