
జనరల్

తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సన్నాహాలు, పట్టభద్రుల ఓటర్ల నమోదు, క్షేత్రస్థాయి కార్యాచరణపై పార్టీ నాయకులతో చర్చలు జరిగాయి.
ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహం, నియోజకవర్గాల వారీగా సమన్వయం, ఓటర్ల నమోదు ప్రక్రియపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి కొత్త ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 28న నోటిఫికేషన్, డిసెంబర్ 30న తుది జాబితా ప్రచురణకు షెడ్యూల్ ఖరారైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!