
షోస్

తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జిగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ రాష్ట్రానికి తన విలువైన సమయాన్ని, సేవలను అంకితం చేసిన మీనాక్షి నటరాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణలో పార్టీకి ఆమె అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేశారు.
మీనాక్షి నటరాజన్ నాయకత్వం, మార్గదర్శకత్వం, అనుభవం నుంచి తాము ఎంతో నేర్చుకున్నామని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఆమె అందించిన సూచనలు, నేర్పిన పాఠాలు తమ రాజకీయ ప్రస్థానంలోనే కాకుండా వ్యక్తిగత జీవితాల్లోనూ ఎప్పటికీ విలువైనవిగా నిలుస్తాయని అన్నారు. ఆమె మార్గదర్శకత్వం, సహకారం, స్ఫూర్తికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్ ప్రయాణం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!