
జనరల్

పొంగూరు నారాయణ అమరావతి రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్ ఇన్ చీఫ్ గోపాల కృష్ణా రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. ప్రభుత్వ భవనాలు, రహదారులు, ఎల్పీఎస్ లేఅవుట్‌ల నిర్మాణ పురోగతిపై సమగ్రంగా చర్చించారు.
ప్రాజెక్టుల వారీగా పనులు ఎంత మేరకు పూర్తయ్యాయనే వివరాలను మంత్రి కాంట్రాక్ట్ సంస్థల నుంచి తెలుసుకున్నారు. వర్షాకాలంలో నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అన్ని సంస్థలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!